
ప్రపంచమంతా ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎంతగా ఎదురు చూస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో మేకర్స్ మూవీకి సంబంధించి వినూత్న ప్రచారం చేస్తున్నారు.ఇటీవల మేకింగ్ వీడియో విడుదల చేసి అంచనాలు భారీగా పెంచిన మేకర్స్ రౌద్రం రణం రుధిరం’ చిత్రంలోని తొలి పాట ‘దోస్తీ’ని విడుదల చేశారు.
తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది ఈ సాంగ్. ఐదు భాషల్లోనూ… బాణీ ఒక్కటే. కానీ, గాత్రం మాత్రం వేర్వేరు. తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో అమిత్ త్రివేదీ, మలయాళంలో విజయ్ యేసుదాసు, కన్నడలో యాజిన్ నిజార్ పాడారు. తెలుగులో ఈ పాటకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా… తమిళంలో మదన్ కర్కి, హిందీలో రియా ముఖర్జీ, కన్నడలో ఆజాద్ వరదరాజ్, తమిళంలో మన్కొంబు గోపాలకృష్ణన్ రాశారు.
ఇద్దరి స్నేహితుల మధ్య ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఈ సాంగ్ రూపొందించారు. ఈ రోజు స్నేహితుల సందర్భంగా విడుదలైన ఈ పాట శ్రోతలని ఎంతగానో అలరిస్తుంది. కీరవాణి తనదైన శైలిలో బాణీలు సమకూర్చారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
This Friendship day, witness the coming together of 2 powerful opposing forces – Ramaraju🔥& Bheem 🌊#Priyam Music Video: https://t.co/e6oHU2Nvkx@MMKeeravaani@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@TSeries @LahariMusic #RRRMovie #Natpu #Dosti
— DVV Entertainment (@DVVMovies) August 1, 2021
This Friendship day, witness the coming together of 2 powerful opposing forces – Ramaraju🔥& Bheem 🌊#Dosti Music Video: https://t.co/GR1v6J1hRa@MMKeeravaani@ItsAmitTrivedi @itsvedhem @anirudhofficial @IAMVIJAYYESUDAS #YazinNizar@TSeries @LahariMusic #RRRMovie #Natpu #Priyam
— Gangubai🤍🙏 (@aliaa08) August 1, 2021