సువిక్షిత్, గీతికా రతన్ జంటగా యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫీల్‌గుడ్ లవ్ డ్రామా ‘దూరదర్శిని’. ‘కలిపింది ఇద్దరిని’ ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు. ఎం.జయశంకర్‌రెడ్డి, పాటిమీది సంతోష్ నిర్మాతలు. ఈ నెల 15న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
హీరో ప్రియదర్శి, ‘రాజు వెడ్స్ రాంబాయ్’ దర్శకుడు సాయి కంపాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలోని భావోద్వేగాలు అందర్నీ హత్తుకుంటాయని, చిన్న సినిమాగా విడుదలవుతున్న ఈ సినిమా, రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుందని దర్శకుడు కార్తికేయ కొమ్మి నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా నటులు సువిక్షిత్, జెమినీ సురేశ్ కూడా మాట్లాడారు.