Dookudu Movie Special Show | పుష్కరకాలం క్రితం వచ్చిన ‘దూకుడు’ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. మహేష్ వీరలెవల్ పర్ఫార్మెన్స్, శ్రీనువైట్ల మార్క్ టేకింగ్, కామెడీ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. సినిమా వచ్చి పన్నెండేళ్లయినా ఇప్పటికి టీవీల్లో వస్తుందంటే రెప్పార్పకుండా చూస్తుంటాం. మహేష్-సమంత కెమిస్ట్రీ, ఈలలు వేయించే ఫైట్లు, కిక్కిచ్చే డ్యాన్సులు ఇలా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ప్యాకేజీలా వచ్చింది. పోకిరి తర్వాత హ్యట్రిక్ డిజాస్టర్లతో సతమతవుతున్న మహేష్‌కు దూకుడు మంచి కంబ్యాక్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే మహా శివరాత్రి కానుకగా ఈ సినిమాను సుదర్శన్-35లో స్పెషల్ షో వేసారు. కాగా కొత్త సినిమా విడుదలైన రేంజ్లో మహేష్ అభిమానులు ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లో సందడి చేశారు. ఈలలు, గోలలతో సుదర్శన్ థియేటర్ దద్ధరిల్లింది. తెరమొత్తం పేపర్లతో నిండిపోయింది. షో మొదలైన్నుంచి అయిపోయేవరకు అభిమానులు అరుస్తూనే ఉన్నారు. నైజాం అంటేనే మహేష్‌ది, నైజాం నవాబ్ మహేష్ అంటూ సూపర్‌స్టార్ అభిమానులు స్లోగన్స్ చేశారు.
ఇప్పటికే మహేష్ నటించిన ‘పోకిరి’, ‘ఒక్కడు’ సినిమాలు రీ-రిలీజ్ కాగా, ఇప్పుడు ‘దూకుడు’ రిలీజైంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా సమంత నటించింది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరెకెక్కిన ఈ సినిమా రూ.58 కోట్లవరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించి డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు అప్పట్లో ఈ సినిమా వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ ‘మగధీర’ తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. శ్రీనువైట్లను ఈ సినిమా స్టార్ డైరెక్టర్‌ను చేసింది.
Babu entry-level 🥵🥵🥵#DookuduSplShow #Dookudu pic.twitter.com/SYRlWSaRHM
— Rahul Mahajan (@RahulPSAK) February 18, 2023
Sivaratri special show #Dookudu
Mass entrance response 🔥 pic.twitter.com/2hnG8mOEGe— ʌınɐʎ (@CooIestVinaay) February 19, 2023