Manchu Vishnu | పేదవాడి జీవితంతో ఆడుకోవద్దు..నాగశీను సెల్ఫీ వీడియో వైరల్
హెయిర్ డ్రెస్సింగ్ ఎక్విప్మెంట్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని, విష్ణు హెయిర్ డ్రెస్సర్‌గా పని చేసే నాగ శ్రీను (Naga srinu) కూడా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఆఫీసులో చోరీ జరగడంతో..దీనిపై మంచు విష్ణు, అతని మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హెయిర్ డ్రెస్సింగ్ ఎక్విప్మెంట్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని, విష్ణు హెయిర్ డ్రెస్సర్‌గా పని చేసే నాగ శ్రీను (Naga srinu) కూడా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాగశీను ఓసెల్పీ వీడియో విడుదల చేశాడు.
మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి తనను చిత్ర హింసలు పెట్టీ చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి కులం పేరుతో అవమానించారని నాగ శీను ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ కారణంగా ఉద్యోగం మానేసినందుకు 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీ అని అక్రమంగా కేసు పెట్టారని హెయిర్ డ్రెస్సర్ వాపోయాడు.
ఫిబ్రవరి 17న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సంఘటన జరిగింది.ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది. ఈ వార్త విన్న మా తల్లి ఆసుపత్రి పాలైంది. నా తల్లికి గుండె నొప్పి రావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేయించాను. 10 ఎండ్లుగా మోహన్ బాబు దగ్గర నమ్మకంగా పని చేస్తున్నాను. నాపై కావాలనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నాలాంటి పేదవాడి జీవితంతో అడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దవాళ్ళకు ఇది తగదు. విష్ణు బాబు నా పైన ఫిర్యాదు చేసి కేసు పెట్టారు. మోహన్ బాబు ఫ్యామిలీ నన్ను అసభ్య పదజాలంతో దూషించినందుకే నేను ఉద్యోగం మానేశాను.నేను ఎలాంటి దొంగతనం చేయలేదని స్పష్టం చేశాడు నాగశీను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

