Don 3 Movie |బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డాన్ 3’ కాస్టింగ్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తారని, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌లోకి తిరిగి రావాలంటే అట్లీ దర్శకత్వం వహించాలనే నిబంధన పెట్టారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చిత్రబృందం తాజాగా స్పందిస్తూ అవి రూమర్స్ అంటూ కొట్టిపారేసింది. అట్లీని ఈ ప్రాజెక్ట్ కోసం అసలు సంప్రదించలేదని ఈ ఫ్రాంచైజీతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని చిత్రబృందం తెలిపింది.
అదేవిధంగా రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, ఆ స్థానంలో హృతిక్ రోషన్ వస్తున్నారనే వార్తల్లోనూ నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఫర్హాన్ అక్తర్ ప్రస్తుతం స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని, అది పూర్తయిన తర్వాతే అధికారికంగా నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని మేకర్స్ వెల్లడించారు.