Mammootty – Gautham Vasudev Menon | మలయాళం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నది ఏ నటుడు అని అడిగితే టక్కున వచ్చే సమాధానం మెగాస్టార్ మమ్ముట్టి. ప్రస్తుతం మమ్ముట్టి తీసినన్ని సినిమాలు నేటి కుర్ర హీరోలు కూడా తీయట్లే అంటే నమ్మక తప్పదు. గత ఏడాది కాథల్ ది కోర్ అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ ఈ ఏడాది భ్రమయుగం, టర్బో సినిమాలతో మంచి విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే మమ్ముట్టి తన తదుపరి సినిమాను తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon)తో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
‘ఏం మాయ చేసావే’, ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ వంటి బ్లాక్ బస్టర్లు అందించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) తాజాగా మమ్ముట్టితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ మమ్ముట్టి పుట్టినరోజుతో పాటు వినాయక చవితి కానుకగా టైటిల్ విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు డొమినిక్ అండ్ ది లేడీస్ పర్సు (Dominic and The Ladies’ purse) అనే టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. మమ్ముట్టి సోంత నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.
Presenting the First Look Poster of Dominic and The Ladies’ purse , Directed by @menongautham & Produced by @MKampanyOffl pic.twitter.com/DQdbxbUhYC
— Mammootty (@mammukka) September 7, 2024