Nithya Menen | నిత్యా మేనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నది. ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం అందుకున్న విషయం తెలిసిందే. నిత్యా మేనన్‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. సినీ ఇండస్ట్రీతో తనకు పేరు ప్రఖ్యాతలతో పాటు ఆస్తులు కూడబెట్టింది. అయితే, తనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం తనకు ఇష్టం లేదని ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
నిత్యా మేనన్ రవి మోహన్‌తో కలిసి కాదలిక్క నెరమిల్లై చిత్రంలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్నది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తనకు సినిమా రంగం అంటే ఏమాత్రం ఇష్టం లేదంటూ బాంబు పేల్చింది. దాంతో అందరూ షాక్ అవుతున్నారు. తనకు మరో రంగం అవకాశం వస్తే ఇప్పటికప్పుడు వెళ్లిపోతానని చెప్పింది. తనకు సెలబ్రిటీలా కాకుండా సాధారణ జీవితాన్ని గడపడం ఇష్టమని చెప్పింది. తనకు ప్రయాణాలు చేయడం అంటే ఎక్కువగా మక్కువని.. అందుకే చిన్నప్పుడు పైలెట్ కావాలని కోరుకునేదాన్ని అని చెప్పింది. తాను చివరకు హీరోయిన్ అయ్యాయని.. ఓ నటిగా స్వేచ్ఛగా జీవించడాన్ని మరిచిపోయిటన్లు వాపోయింది.
తనకు పార్కుల్లో నడవడం ఇష్టమని.. ఇప్పుడు అలా చేయలేకపోతున్నానని.. ఒక్కోసారి తనకు ఇదంతా అవసరమా? అనిపిస్తుందని చెప్పింది. జాతీయ అవార్డు రాక ముందు ఎక్కడికైనా వెళ్లిపోదామని భావించానని.. అదే సమయంలో జతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిత్యా మేనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా నిత్యామేనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నది. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నది. చివరగా కొలాంబి మూవీలో నటించిన నిత్యా.. ఇడ్లీ కడై, డియర్ ఎక్సెస్‌తో పాటు వీజేఎస్ ఫిల్మ్‌లో హీరోయిన్గా నటిస్తున్నది. నిత్యా తెలుగులో చివరిసారిగా బీమ్లా నాయక్ చిత్రంలో కనిపించింది.