Vantara Sanctuary | రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు సంరక్షణ ప్రాజెక్ట్ వంతారాపై ప్రత్యేక డాక్యుమెంటరీ తెరకెక్కింది. ‘వంతారా సాంక్చురీ స్టోరీస్’ పేరుతో ఈ డాక్యుమెంటరీ రాగా ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ డాక్యు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. సాంక్చురీ స్టోరీస్ సీజన్- 1 పేరుతో ఈ సిరీస్‌ను విడుదల చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టును దాని వెనుక ఉన్న కృషిని, లక్ష్యాలను ఈ డాక్యుమెంటరీ ప్రజలకు పరిచయం చేయనుంది.
అమెరికాకు చెందిన ట్రావెలర్, టెలివిజన్ హోస్ట్ ఫారెస్ట్ గాలంటే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించగా.. వంతారాలోనే చిత్రీకరణ జరుపుకొన్న ఈ డాక్యుమెంటరీని ఆరు ఎపిసోడ్లుగా అందుబాటులో ఉంచారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 3000 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులో గాయపడిన, అంతరించిపోతున్న జంతువులను ఎలా రక్షిస్తున్నారు, వాటికి అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలు, పునరావాస కేంద్రాల గురించి ఇందులో చూపించనున్నారు.
Watch ‘Vantara – Sanctuary Stories’ on JioHotstar.
Step into the heart of Vantara, the world’s largest animal rescue, rehabilitation, and conservation sanctuary – where compassion and care meets wild and majestic beauty. Guided by renowned wildlife biologist Forrest Galante,… pic.twitter.com/GBy5IXGnQF— Sandeep Parkhi (@sparkhi) November 11, 2025