Ari Movie | సాయికుమార్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సినిమా అరి (Ari). పేపర్‌బాయ్ ఫేం జయశంకర్ (jayashankar) డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఎవరూ టచ్ చేయని విధంగా అరిషడ్వర్గాలనే ఇతివృత్తం నేపథ్యంలో మూవీ సాగనుందని సమాచారం. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని మూవీ లవర్స్‌తో షేర్ చేశాడు డైరెక్టర్.
సైకో మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమా పూర్తవగా.. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. భగవద్గీత సారాన్ని చూపించిన ఈ సినిమాను ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు మఠాధిపతులు, స్వామిజీలు చూసి ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమా అధికారికంగా విడుదలయ్యే కంటే ముందే కొంతమందికి స్పెషల్‌గా చూసే అవకాశమివ్వనున్నట్టు ప్రకటించాడు డైరెక్టర్ జయశంకర్.
మూవీ లవర్స్ ఈ సినిమాను ముందే చూడాలనుకుంటే తాను ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయాలని లేదంటే ఇచ్చిన స్కానర్‌ను స్కాన్ చేసి వివరాలు పంపమని తెలియజేశారు. ఇంకేంటి మరి సినిమాను ముందే చూడాలనుకుంటే మీ వివరాలు పంపేయండి. ఈ మూవీని త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నారు.
అరి ట్రైలర్..
Ram Gopal Varma | సారీ ప్రమోషన్స్‌తో బిజీ.. విచారణకు రాలేనన్న రాంగోపాల్ వర్మ..!
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్