Vijay Sethupathi | తమిళ సినీ ప్రేక్షకుల గుండెల్లో “మక్కల్ సెల్వన్” గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగానే కాదు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నాడు. విజయ్ సేతుపతి తమిళంలో ‘తెన్మెర్కు పరువాకత్రు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అయితే, అంతకు ముందే పలు చిత్రాల్లో చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టారు. ‘పిజ్జా’ సినిమా విజయంతో టర్నింగ్ పాయింట్ వచ్చింది. తర్వాత ‘సేతుపతి’, ‘విక్రమవేద’, ‘96’, ‘మాస్టర్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నారు. అయితే విలన్‌గానూ ఆయన నటనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి, 2021లో వచ్చిన ‘ఉప్పెన’ చిత్రంలో విలన్‌గా చేసిన ‘రాయణం’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఆ పాత్రలోని పంచులు, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా విజయ్‌కి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేలా చేసింది. విజయ్ సేతుపతికి ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్‌తో జవాన్ సినిమాలో విలన్‌గా మెప్పించిన విజయ్, ఇటీవల కత్రినా కైఫ్‌తో కలిసి ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రంలో నటించి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల సెలబ్రిటీలు అంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కాని విజయ్ సేతుపతి అంత యాక్టివ్‌గా ఉండడు. అయినప్పటికీ ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒకే ఒక్క హీరోయిన్ను మాత్రమే ఫాలో అవుతున్నారు. ఆమె ఎవరో తెలుసా? మన తెలుగు బ్యూటీ అంజలి!
అంజలి తెలుగులోనూ, తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె విజయ్ సేతుపతితో కలిసి ‘సింధుబాద్’, ‘ఐరావి’ సినిమాల్లో నటించారు. వారి మధ్య ఉన్న స్నేహం కారణంగా సోషల్ మీడియాలో అంజలిని ఫాలో అవుతున్నాడు విజయ్ సేతుపతి. ఇక సినిమాల విషయానికి వస్తే పూరీ జగన్నాథ్‌తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సెప్టెంబర్ 28న పూరీ బర్త్ డే సందర్భంగా ఈ ఊవీకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి.