Mirai | హనుమాన్ ఫేం తేజ సజ్జా (Teja Sajja) సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి మ్యాజిక్ చేసేందుకు మిరాయి (Mirai) సినిమాతో రాబోతున్నాడని తెలిసిందే. ఈ పాన్ ఇండియా అడ్వెంచరస్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు.
ఢిల్లీ భామ రితికా నాయక్ (Ritika Nayak) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మంచు మనోజ్ (Manchu Manoj) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2025 సెప్టెంబర్ 5న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ షురూ అయ్యాయి.
ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారని తెలిసిందే. కాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఆసక్తికర అప్డేట్ అందించారు. మిరాయిని హిందీలో ఎవరు విడుదల చేస్తున్నారో తెలుసా..? పాపులర్ బీటౌన్ ప్రొడక్షన్ హౌజ్ కరణ్ జోహార్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ హిందీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో సినిమాపై క్రేజ్ మరింత పెరగడమే కాదు.. థియేటర్ల సంఖ్య కూడా భారీగానే పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలిసిపోతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ జెట్ స్పీడ్‌లో ప్రమోషన్స్ కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా ఉత్తరాదిన ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి.
మిరాయి చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తుండగా.. గౌరా హరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2డీ, 3డీ వెర్షన్లలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందని వస్తున్న వార్తలపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన మిరాయి టైటిల్ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
An ancient secret. A dangerous journey. A hero rises⚔️
Be a part of this epic adventure.#Mirai, in cinemas on 5th September.
North India Release By Dharma Productions pic.twitter.com/YqTzSVnXLl
— Dharma Productions (@DharmaMovies) August 14, 2025
Nabha Natesh | బ్లాక్ డ్రెస్‌లో కిక్కిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ.. డ్యాన్స్‌తోను ఇరగదీసిందిగా..!
Jio Hotstar Free | ‘ఆపరేషన్ తిరంగ’.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉచితంగా జియో హాట్‌స్టార్
Jigris Teaser | 2 మిలియన్ వ్యూస్.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘జిగ్రీస్’ టీజర్