Avatar 2 Languages | విజువల్ వండర్ ‘అవతార్ 2’ ఎన్ని భాషల్లో వస్తుందో తెలిస్తే షాకే..!
హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ (James Cameron) డైరెక్షన్లో 2009 వచ్చిన అవతార్ రికార్డులమోత మోగించి గ్లోబల్ బాక్సాపీస్‌ను షేక్ చేసింది. ప్రపంచ సినీ పరిశ్రమలోనే ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది.
అవతార్ సినిమాతో సినీ అభిమానులను సరికొత్త అద్బుత ప్రపంచంలోకి తీసుకెళ్లాడు హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ (James Cameron). 2009 వచ్చిన ఈ చిత్రం రికార్డులమోత మోగించి గ్లోబల్ బాక్సాపీస్‌ను షేక్ చేసింది. ప్రపంచ సినీ పరిశ్రమలోనే ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. మళ్లీ ఆ చిత్రాన్ని మైమరిపించేలా ఇపుడు అవతార్ 2 (Avatar 2)ను కూడా రెడీ చేస్తున్నాడీ డైరెక్టర్.
అవతార్ 2 డిసెంబర్ 16న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుందని ఇప్పటికే మేకర్స్ ఓ అప్ డేట్ కూడా ఇచ్చేశారు. అయితే తాజాగా మరో క్రేజీ అప్డేట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషల్లో విడుదలవుతుందో తెలిస్తే షాకవడం గ్యారంటీ. అవతార్ 2 అన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు 160 భాషల్లో విడుదల కాబోతుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారిపోయింది. 3డీ, 4డీఎక్స్, ఐమాక్స్, డాల్బీ విజన్, పీఎల్ఎఫ్తోపాటు ఇతర ఫార్మాట్లలో అవతార్ 2 సందడి చేయబోతుంది.
లాస్ వెగాస్‌లోని కాసార్స్ ప్యాలెస్ సినిమా కాన్‌లో అవతార్ 2 మొదటి వీడియో గ్లింఫ్స్ ప్రీమియర్ కానుందట. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 గ్లింప్స్ వీడియోను యూ ట్యూబ్‌లో వీక్షించాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందేనంటున్నారు మేకర్స్.
అవతార్ 2 ట్రైలర్ (Avatar 2 trailer)ను మే 6న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని గతంలో ఓ అప్ డేట్ తెరపైకి వచ్చింది. అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. ఈ క్రేజీ సీక్వెల్ ఎప్పటిలాగే తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా సందడి చేయనుంది.
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Also : Nandamuri Balakrishna | ఆస్పత్రిలో బాలకృష్ణ..పుకార్లపై పీఆర్ టీం క్లారిటీ
Read Also : Kiara Advani post | బ్రేకప్ వార్తల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా కియారా తాజా పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

