Tamannaah Bhatia | మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఫైట్ చేస్తూనే ఉంది. కొత్త భామల హవా నడుస్తున్న సమయంలో ఈ సీనియర్ భామ అవకాశాలు అంతగా అందిపుచ్చుకోలేకపోతుంది. అయితే అడపాదడపా మాత్రం ఏదో ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంది. ఓ వైపు గ్లామర్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటుతున్నార . ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి కొనసాగింపుగా ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఓదెలా 2 ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇందులో తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ సినిమా రిలీజైన రెండు వారాల తరువాత రైడ్ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మిల్కీ భామ.
అయితే ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలలో యాక్టివ్‌గా పాల్గొంటుంది. తాజాగా తమన్నా ఓదెల 2 చిత్ర ప్రమోషన్లలో భాగంగా హైదరాబాదులో స్ట్రీట్ ఫుడ్ తింటూ కనిపించింది. ఆ సమయంలో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఒక చాట్ స్పాట్ లో దర్శనమిచ్చిన తమన్నా తనకి స్ట్రీట్‌ఫుడ్ అంటే చాలా ఇష్టమని, అందులో హైదరాబాద్ స్ట్రీడ్ ఫుడ్‌ని చాలా ఇష్టపడతానని పేర్కొంది.
దోశ ప్లస్ పావు బాజీ నా ఫేవరేట్ ఫుడ్ అని చెప్పి తమన్నా అందరు నోరెళ్లపెట్టేలా చేసింది. సాధారణంగా ఎవరైన దోశ లేదా పావుబాజీలలో ఏదో ఒకటి మాత్రమే ఇష్టంగా తింటారు. కాని తమన్నా మాత్రం ఈ రెండింటిని కలిపి తింటుందట. ఇది విని అందరు అవాక్కవుతున్నారు. ఈ కాంబో ఎలా నచ్చిందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం నేను స్ట్రిక్ట్ డైట్ లో ఉండడం వల్ల బ్రెడ్ తినలేను కాబట్టి ఇంట్లోనే దోశ వేసుకుని బాజీతో కలిపి తింటాను. ఈ కాంబో నాకు ఎంతో ఇష్టం అంటూ తమన్నా స్పష్టం చేసింది. బిర్యాని కూడా తనకి ఇష్టమని, హైదరాబాద్ బిర్యానీకి ఏదీ సాటి రాదని పేర్కొంది. మొత్తానికి తమన్నా ఫేవరేట్ ఫుడ్ తెలుసుకున్న నెటిజన్స్ తాము కూడా ఓ సారి అలా ట్రై చేస్తే పోలా అని అనుకుంటున్నారు.