శ్రీదేవి సోడా సెంటర్ ఆనందికి పెళ్లయిందా?
తెలంగాణ ఆనంది తమిళ సినిమా పరిశ్రమలో హీరోయిన్గా అదరగొడుతున్నది.
ఆనందానికి అడ్రస్‌లా కనిపిస్తూ.. కోటి నవ్వుల వీణ అనిపించుకొంటున్నది.
పెండ్లి అనేది జీవితంలో ఓ ముఖ్య ఘట్టమే కానీ, కెరీర్‌కు అడ్డు కానేకాదని నిరూపిస్తున్నది.
తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ‘శ్రీదేవి సోడా సెంటర్’ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందమైన ఆనంది గురించి ..

‘ఈరోజుల్లో’ సినిమాలో చిన్నపాత్రలో కనిపించినా,అదే ఏడాది ‘బస్‌స్టాప్’తో హీరోయిన్గా వెండితెర మీద వెలిగిపోయింది ఆనంది. 2014లో ‘కాయల్’ విజయంతో, కాయల్ ఆనందిగా స్థిర
పడిపోయింది. ఆ సినిమాలో నటనకు తమిళనాడు రాష్ట్ర పురస్కారానికి నామినేట్ అయ్యింది.

జనవరిలో ఏ హంగూ ఆర్భాటం లేకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో సోక్రటీస్ అనే కుర్రాడిని మనువాడింది. మెరైన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సోక్రటీస్ పలు తమిళ సినిమాలకు
అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ‘నచ్చినవాడిని పెండ్లాడాను. ఇక, విభిన్న పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది’ అంటూ తన ఆశలను పంచుకున్నది ఆనంది.

తెలుగులో పరిచయమై,తమిళంలో రాణిస్తున్న ఆనంది సొంతూరు వరంగల్. అసలు పేరు హసిక. సినిమాల్లోకి వచ్చాక కొత్త పేరుతో పాపులర్ అయ్యింది. ఓ తమిళ సినిమా కోసం హసిక పేరును
రక్షితగా మార్చారు. అలా ఆనందిని తెలుగు, తమిళ అభిమానులు ముచ్చటగా మూడు పేర్లతో పిలుచుకొంటున్నారు.

లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. తెలుగులో డబ్ అయిన తమిళ వెబ్ సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’లో కలై పాత్రలో ఆనంది నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తమిళంలో ఆనంది నటించిన రెండు సినిమాలువిడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది మలయాళ పరిశ్రమలోనూ అడుగుపెట్టనుందీ తెలంగాణ చిన్నది.

స్కిన్ షోకు దూరంగా ఉంటూ పదహారణాల ప్రతిభతో రాణిస్తున్నది ఆనంది. పలు చిత్రాల్లో సంప్రదాయ కట్టూ బొట్టుతో కనిపించి తెలుగుదనానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచింది.
సత్తా ఉంటే ఎప్పటికైనా అవకాశాలు వస్తాయన్నది తన నమ్మకం.

తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న ఆనంది, దాదాపు ఆరేండ్ల గ్యాప్ తర్వాత ‘జాంబిరెడ్డి’తో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ‘శ్రీదేవి సోడా సెంటర్’లో సుధీర్‌బాబు సరసన ‘సోడాల శ్రీదేవి’గా టాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
యజ్ఞం అసలు హీరో గోపీచంద్ కాదు.. మరి ముందు అనుకున్నది ఎవర్ని..?
సంపాదించినది అప్పులకే సరిపోయింది.. కన్నీరు పెట్టుకున్న రోజా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
మేము ఐదుగురం కాదు.. ఎనిమిది మంది.. మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

