Shah Rukh Khan | బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ ఇటీవల ఒక సినిమా షూటింగ్లో గాయపడి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. కొన్నిరోజులుగా షూటింగ్ లేకా ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతున్న షారుఖ్ తాజాగా అభిమానులతో ముచ్చటించడానికి ఎక్స్ వేదికగా ఆస్క్షారుఖ్ అనే లైవ్ సెషన్ పెట్టాడు. ఇందులో షారుఖ్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి అప్డేట్లను పంచుకున్నాడు.
ఈ సెషన్లో ఒక అభిమాని అడుగుతూ.. షారుఖ్ సర్ మీరు జ్యోతిష్యం నమ్ముతారా? అని అడుగుతాడు. దీనికి షారుఖ్ బదులిస్తూ.. మీకు రేపు మంచి రోజు అని చెప్పినంత వరకు నమ్ముతాను. మీకు చాలా డబ్బు వస్తుందని చెప్పినంత వరకు నమ్ముతాను. అంటూ షారుఖ్ నవ్వులు పూయించాడు. మరో అభిమాని షారుఖ్‌ని అడుగుతూ.. మీ తదుపరి చిత్రం ఏంటి అని అడుగగా.. కేవలం కింగ్ సినిమా మాత్రమే…. పేరు వినే ఉంటారు? అంటూ బదులిచ్చాడు.