రీసెంట్గా డీజే టిల్లు (DJ Tillu)తో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు గుంటూరు టాకీస్ ఫేం సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda). సెకండ్ వేవ్ తర్వాత బాక్సాపీస్‌ను షేక్ చేసిన తెలుగు చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ మూవీలో సిద్ధు పక్కా హైదరాబాదీ స్టైల్లో కామెడీ టచ్‌తో చేసిన యాక్టింగ్ న భూతో న భవిష్యతీ అన్నట్టుగా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే..ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడట సిద్దు. వీటిలో ఓ ప్రాజెక్టులో నెగెటివ్ రోల్ కాగా..మరో సినిమా లీడ్ రోల్ అట.
ఇందులో ఒకటి డీజేటిల్లు సీక్వెల్. అవును మీరు విన్నది నిజమే. తాజా టాక్ ప్రకారం సిద్దు ప్రస్తుతం డీజీటిల్లు పార్ట్ 2 (DJ Tillu Part 2) పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఫస్ట్ పార్టు తెరకెక్కించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) సీక్వెల్ కూడా తెరకెక్కించబోతుందని ఇన్ సైడ్ టాక్. సిద్దు అండ్ టీం స్క్రిప్టు పనుల్లో ఉన్నట్టు తెలుస్తోండగా..స్కిప్ట్ వర్క్ దాదాపు చివరి దశకు వచ్చేసిందట. ఈ సారి సీక్వెల్లో పూర్తిగా కొత్త అవతారంలో రావడం ఖాయమని అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు మూవీ లవర్స్.
కథ పరంగా చూసుకుంటే సీక్వెల్లో ఫస్ట్ పార్టు ఫ్లేవర్ కొనసాగింపునకు అంత స్కోప్ లేదనే చెప్పాలి. మరి డీజే టిల్లు కొత్త ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేస్తాడా..? కంప్లీట్ కొత్త వెర్షన్‌తో వస్తాడా..? అనేది చూడాలి. సీక్వెల్‌తో సిద్దు కొత్త హీరోయిన్ను పరిచయం చేయబోతున్నాడని టాక్.
Read Also : Chiranjeevi | సెకండాఫ్ మార్చాలని అభిమానికి చిరంజీవి సూచన..?
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Also : Directors Bullet Song | బుల్లెట్ సాంగ్‌కు స్టార్ డైరెక్లర్లు డ్యాన్స్ చేస్తే..వీడియో హల్చల్