Dj Tillu | డీజే టిల్లు చిత్రంలో హీరో తండ్రిగా నటించిన మురళీ ధర్ గౌడ్ మనందరికి సుపరిచితమే. ఇటీవలి కాలంలో ఆయన చాలా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు. అయితే ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సినిమా రంగంలో ఏ విధంగా అవకాశం వచ్చింది వంటి విషయాల గురించి చెప్పి ఆశ్చర్యపరిచాడు. ముందు ఆయన కరీంనగర్ జిల్లాలోని ఆఫీసులో అకౌంటెంట్‌గా పని చేసేవారట. రిటైర్మెంట్ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడట. ఎంత బతిమిలాడిన అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. చిన్నప్పటి నుండి నేను కఠిక పేదరికం అనుభవించాను అని అన్నాడు.
తమ తల్లిదండ్రులకి మేము ఐదుగురు సంతానం కాగా, చిన్నప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా సరిగా ఉండేవి కావు. చెప్పులు లేవు. తినడానికి సరైన తిండి ఉండేది కాదు. బగారా ఎప్పుడో తినేవాళ్లం. ఉడికించిన కోడిగుడ్డు ముగ్గురం తినేవాళ్లం. అలా పెరిగిన నేను పెద్దయ్యాక కోట్లు సంపాదించాలని డిసైడ్ అయ్యాను. అయితే సినిమాలలోకి రావాలని అనుకున్నప్పుడు అవకాశాలు ఇవ్వకపోయిన నిరాశ చెందకుండా రోజూ షూటింగ్స్ జరిగే ప్రాంతానికి వెళ్లి అసలు సినిమా ఎలా తీస్తారు. ఆర్టిస్టులు ఎలా నటిస్తున్నారు అని పరిశీలించేవాడిని. ముందు ఛాన్స్ కోసం బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా వెళ్లాను. అలా మూడు సినిమాలు చేసిన గుర్తింపు రాలేదు.
అయితే కృష్ణం రాజు డైలాగులు బట్టికొట్టి ఆడిషన్స్‌కి వెళ్లిన ప్రతిచోట అది చెప్పేవారంట. అలా కొన్ని వందల ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత డీజీ టిల్లు సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పారు మురళీధర్ గౌడ్. డీజీటిల్లు సినిమా అనంతరం అతనికి మంచి పేరు వచ్చింది. అవకాశాలు తలుపు తట్టాయి. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తను నటించిన అన్ని సినిమాలు దాదాపు సక్సెస్ అవుండడం తన అదృష్టం అంటుంటాడు మురళీధర్. చాలా మంది ఇతరులను చూసి ఈర్ష పడుతుంటారని అలా చేస్తే వారు పైకి రారని చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడు మూలాలని మరిచిపోను. ఇప్పటికీ తాను కర్మఫలాన్ని నమ్ముతుంటానని చెప్పారు. కసితో కష్టపడే ప్రతి వ్యక్తినీ అదృష్టం ఏదో ఒకరూపంలో తలుపు తడుతుందని కూడా మురళీధర్ గౌడ్ చెప్పుకొచ్చారు.