అగ్రహీరో రామ్‌చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రంలో ‘రామ్ బుజ్జి’గా పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు ‘మీర్జాపూర్’ సిరీస్ ఫేం దివ్యేందుశర్మ.
ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. క్రికెట్ బంతిని ఎగరేస్తూ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న దివ్యేందుశర్మను ఈ పోస్టర్లో చూడొచ్చు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లో భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్‌ని షూట్ చేస్తున్నారు. మైండ్‌బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో మేజర్ హైలైట్ కానున్నాయని మేకర్స్ చెబుతున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్కమార్, జగపతిబాబు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్.