Divya bharathi | తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ (GV Prakash) గాయని సైంధవి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జీవీ విడాకులు తీసుకోవడానికి కారణం హీరోయిన్ దివ్య భారతితో ప్రేమలో ఉన్నందుకే అంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకోచ్చాయి. ఈ వివాదంపై జీవీ ప్రకాశ్‌తో పాటు దివ్యభారతి గతంలోనే స్పందించారు. అయితే ఈ వివాదం ఇంకా ముగియకపోవడంతో తాజాగా ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది దివ్యా భారతి.
నాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల కుటుంబపు విషయాల్లో నా పేరును లాగుతున్నారు. జీవీ ప్రకాశ్ కుటుంబ సమస్యలతో నాకు ఎటువంటి లింక్ లేదు. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవరితోనూ డేటింగ్లో లేను. ముఖ్యంగా పెళ్లైన వ్యక్తితో డేటింగ్ అసలే చేయను. ఆధారాలు లేకుండా రూమర్స్‌ను పుట్టించొద్దు. ఇప్పటివరకూ ఈ విషయంపై నేను నోరు మెదపలేదు. కానీ, కొన్ని రోజులుగా ఈ రూమర్స్ నా సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఈ గాసిప్‌ల వల్ల నా పేరు చెడిపోతోంది. తప్పుడు వార్తలు సృష్టించడం కంటే సమాజానికి ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టండి. నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి. ఈ విషయంపై ఇదే నా తొలి మరియు చివరి ప్రకటన అని దివ్య భారతి చెప్పుకోచ్చింది. దివ్య భారతి, జీవీ కలిసి బ్యాచిలర్, కింగ్స్టన్ మూవీలో నటించారు. ఈ క్రమంలో వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.