Disha patani | లోఫర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను పలుకరించింది బాలీవుడ్ భామ దిశా పటానీ (Disha patani). ఈ యూపీ సుందరి ఆ తర్వాత హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది. చాలా కాలం తర్వాత ప్రస్తుతం తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా ప్రభాస్ టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న Kalki 2898 ADలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటివరకు నటిగా అందరికీ వినోదాన్ని అందిస్తూ.. బాలీవుడ్లో ఉన్న హాటెస్ట్ నటీమణుల్లో ఒకరిగా లీడింగ్ పొజిషన్లో నిలిచింది.
దిశాపటానీ ఇక తనలోని డైరెక్టర్ని అందరికీ పరిచయం చేసేందుకు రెడీ అయింది. ఈ భామ ఓ మ్యూజిక్ వీడియోతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తుంది. Kyun Karu Fikar మ్యూజిక్ వీడియో సాంగ్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది దిశాపటానీ. బ్లూ కలర్ పొట్టి డ్రెస్‌లో ఉన్న దిశా పటానీ సముద్ర అలల మధ్య కూర్చొని చల్లటి గాలులను ఆస్వాదిస్తున్న లుక్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. మీరు నియంత్రించలేని వాటిని వదిలేస్తే.. అది మీకు స్వేచ్ఛనిస్తుంది. నేనెందుకు బాధపడాలి (Kyun Karu Fikar) అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
సాంగ్ టీజర్‌ను ఆగస్టు 16న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయనున్నట్టు తెలియజేసింది. వయు రాసిన ఈ పాటను వైభవ్ పణి కంపోజిషన్‌లో నిఖితా గాంధీ పాడింది. ఇప్పటివరకు గ్లామర్ డాళ్‌గా ఓ మెరుపు మెరిసిన దిశాపటానీ ఈ పాటతో డైరెక్టర్‌గా ఎలాంటి స్కిల్స్ చూపించబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు. దిశా పటానీ ప్రస్తుతం హిందీలో యోధ, తమిళంలో కంగువ సినిమాల్లో నటిస్తోంది.
Kyun Karu Fikar ఫస్ట్ లుక్..