శాంతిచంద్ర, దీపికాసింగ్, సిమిత్రీ బతీజా, నిక్కిషారంగ్ వాలా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డర్టీఫెలో’. అడారి మూర్తిసాయి దర్శకుడు. రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి.శాంతిబాబు నిర్మిస్తున్నారు. ఈ నెల 24న విడుదలకానుంది.
సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, సంపూర్ణేష్‌బాబు అతిథులుగా హాజరయ్యారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథాంశమిదని, యువత మెచ్చే అన్ని అంశాలుంటాయని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని, టెక్నికల్‌గా కూడా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించామని హీరో శాంతిచంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.