Directors| ఒకప్పుడు దర్శకులకి అంతగా గుర్తింపు ఉండేది కాదు. అలానే వారి రెమ్యునరేషన్ కూడా పెద్దగా ఉండేది కాదు. రెమ్యునరేషన్ అంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది హీరోలే. అప్పట్లో లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలు ఇప్పుడు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ మధ్య కాలంలో దర్శకులు అద్భుతాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. భారతీయ సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటిస్తున్న దర్శకులకి నిర్మాతలు గట్టిగానే ముట్టచెబుతున్నారు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, అట్లీ, నాగ్అశ్విన్ లాంటి కొంత మంది మేకర్స్ తీసిన సినిమాలకి 1000 కోట్ల వసూళ్లు రావడంతో వారి మార్కెట్ మరింత పెరిగింది.
ఈ దర్శకులతో స్టార్ హీరోలు సినిమాలు చేయాలని క్యూలో ఉన్నారు. అయితే ఇప్పుడు దర్శకులు కూడా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనకాడడం లేదు. కొందరైతే రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో రాజమౌళి, సుకుమార్ ఎప్పుడో చేరారు. ఈ లెక్కన చూస్తే దర్శకులు హీరోల రెమ్యునరేషన్‌ని దాటేసినట్టుగా కనిపిస్తుంది. అయితే వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ పేరు ఇప్పటి వరకు బయటకు రాలేదు. కాకపోతే వారు లాభాల్లో భారీ వాటా తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వంద కోట్లు ఎప్పుడో అందుకొని ఉంటారనే టాక్ నడుస్తుంది.
ఇక స్టార్ డైరెక్టర్ అట్లీ విషయానికి వస్తే ఆయన తదుపరి సినిమా బన్నీతో చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సన్నీ పిక్చర్స్ సంస్థ అట్లీకి వంద కోట్ల పారితీషికం ఇస్తున్నట్టు కూడా ప్రచారం నడుస్తుంది. అయితే రాజమౌళి, సుకుమార్ లాంటి వారు వంద కోట్లు అందుకున్నట్టు ఎక్కడా వార్త బయటకు రాలేదు కాని ఇప్పుడు వంద కోట్లు తీసుకుంటున్నాడు అంటూ వార్త రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా కోసం బన్నీ కూడా సినిమాలో షేర్ అడగడంతో ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతున్నట్టు టాక్ నడుస్తుంది. ఈ రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో అప్పుడు సినిమా పట్టాలెక్కడం గ్యారెంటీ అంటున్నారు.