Directors| ఇటీవల సినీ పరిశ్రమలో రీ యూనియన్ ట్రెండ్ బాగా హైలైట్ అయింది. సీనియర్ నటీనటులు, దర్శకులు కలిసి గత జ్ఞాపకాలను పునరుద్ఘాటిస్తూ ఆనందంగా గడిపేస్తున్నారు. ఇటీవల 90ల కాలంలో సూపర్ హిట్స్ అందించిన తమిళ్, తెలుగు నటీనటులు కలిసి రీ యూనియన్ పార్టీ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా, తమిళ్ సినీ పరిశ్రమకు వెలకట్టలేని కృషి చేసిన దర్శకులు ఒకే చోట సమావేశమై ఒక ఫోటో కోసం పోజ్ ఇవ్వగా, ఆ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఫోటోలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, నెల్సన్ దిలీప్ కుమార్ (ఈ జెనరేషన్‌కు బాగా పరిచితమైన దర్శకుడు), శంకర్ (విజువల్ వండర్స్‌కు కేరాఫ్ అడ్రస్), మణిరత్నం (క్లాసికల్ మాస్టర్పీసులకు మారుపేరు), మిస్కిన్ (ఇంటెన్స్ నరేషన్‌కి పేరుగాంచిన దర్శకుడు), లింగుస్వామి (కమర్షియల్ హిట్లకు స్పెషలిస్ట్), మురుగదాస్ (పాన్ ఇండియా విజయాల కారకుడు), కేఎస్ రవికుమార్ (సినిమా మాస్టర్, స్టార్ హీరోల ఫేవరెట్ డైరెక్టర్) అందరు కూర్చొని ఫొటోకి పోజులిచ్చారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవగా, తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు కూడా వీరందరు ఇలా కలవడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “అందరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉండడం అరుదైన సన్నివేశం”, “ఈ ఒక్క ఫోటోలో సుమారు 100 బ్లాక్బస్టర్లు దాగున్నాయ్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ రీ యూనియన్ పార్టీ ఎక్కడ జరిగింది? ఎందుకు సమావేశమయ్యారు అన్నదానిపై స్పష్టత రాకపోయినా, ఈ తరహా మీటింగ్‌లు టాలెంటెడ్ మేకర్స్ మధ్య బంధాన్ని బలపరిచే అవకాశం కల్పిస్తాయన్నది మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది.. సినిమా ప్రేమికులకు ఇది నిజంగా ఒక విజువల్ ట్రీట్.