స్వీయ దర్శకత్వంలో దేవన్ హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ లవ్‌స్టోరీ ‘కృష్ణలీల’. ‘తిరిగొచ్చిన కాలం’ ఉపశీర్షిక. ధన్య బాలకృష్ణ కథానాయిక. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ‘ప్రేమించడం, ప్రేమించబడటం..రెండూ కర్మలే. ఈ ప్రేమని అనైతికంగా అనుభవించాలనుకున్నా, అవాయిడ్ చేయాలనుకున్నా.
అది మరింత కాంప్లికెటెడ్ అయి, ఎన్ని జన్మలైనా నీకు సరైన పాఠం నేర్పే వరకు వదలదు’ అనే పవర్ఫుల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సూపర్ నేచురల్ అంశాలు కలబోసిన ప్రేమకథా చిత్రమిదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని చిత్రబృందం పేర్కొంది. వినోద్‌కుమార్, పృథ్వీ, రవి కాలే, తులసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాత: జ్యోత్స్న జి, దర్శకత్వం: దేవన్.