పూలరంగడు, చుట్టాలబ్బాయి చిత్రాలతో కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు దర్శకుడు వీరభద్రం చౌదరి. తాజాగా ఆయన ఓ క్రైమ్ కామెడీ కథను రూపొందించబోతున్నారు. నరేష్ అగస్త్య (‘సేనాపతి’ ఫేమ్) హీరోగా నటించనున్న ఈ చిత్రానికి నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మాతలు.
జూలై నుంచి చిత్రీకరణ మొదలుకానుంది. క్రైమ్ నేపథ్యంలో నడిచే కామెడీ చిత్రమిదని, మంచి కథ కుదిరిందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: అనిల్‌రెడ్డి, నిర్మాణ సంస్థలు: జయదుర్గాదేవి మల్టీమీడియా, డెక్కన్ డ్రీమ్ వర్క్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం చౌదరి.