Director Vamsy | దర్శకుడు వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రచయితగాను ఆయనకు మంచి పేరున్నది. ఆయన సినిమాలకు ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సీనియర్ నటి భానుప్రియను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. ఆయన దర్శకత్వంలో భానుప్రియ సితార, అన్వేషణ, ఆలాపన తదితర సినిమాలో నటించింది. ఈ సినిమాలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయాయి. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో దర్శకుడు వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై ప్రస్తావంచారు. కెరియర్ మొదటల్లో ఏ సినిమా చేస్తే బాగుంటుందనే విషయంలో తన సలహాలు, సూచనలను భానుప్రియ అడిగి తెలుసుకుంటుండేదని చెప్పారు.
గ్లామరస్, మోడ్రన్ లుక్‌లో కనిపించే రోల్స్ తనకు రావడం లేదనే అంతృప్తికి గురయ్యేదని వంశీ గుర్తు చేసుకున్నారు. దాంతో అన్వేషణ మూవీలో మోడ్రన్‌గా కనిపించే అమ్మాయిలా చూపించానన్నారు. అప్పటి నుంచే ఆ తరహా పాత్రలు వచ్చాయని భానుప్రియ చెప్పిందని తెలిపారు. భానుప్రియ చూసి దాదాపు 35 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. భానుప్రియను పెళ్లి చేసుకోవాలని డైరెక్టర్ వంశీ భావించినట్లు ఆ రోజుల్లో ప్రచారం జరిగిందే. ఈ విషయంపై ఆయనను ప్రశ్నించగా.. ఆయన స్పందించలేదు. అదంతా గతమని.. చాలా ఏళ్లనాటి పాత కథ అంటూ దాటవేశారు. ఈ రోజు వరకు నాకు ఎవరూ లేరని.. తన భార్య కూడా చనిపోయిందని వాపోయారు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారని.. ఒకరు హైదరాబాద్ ఒకరు, చెన్నైలో మరొకరు స్థిరపడ్డారని చెప్పారు. మొదటి నుంచి పిల్లలిద్దరికీ సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదంటూ వంశీ వివరించారు.