Tuk Tuk Movie | ‘ఓ వాహనానికి ప్రాణం, భావోద్వేగాలు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. మనలాగే ఆలోచించగలిగే ఓ స్కూటర్ నేపథ్యంలో కథ నడుస్తుంది’ అని చెప్పారు సుప్రీత్కృష్ణ. ఆయన దర్శకత్వంలో హర్ష రోషన్, కార్తికేయ, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘టుక్ టుక్’ చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుప్రీత్కృష్ణ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు తెలియజేశారు. చిత్తూరు నేపథ్యంలో 90స్ నుంచి 20 దశకం వరకు కథ నడుస్తుందని, ముగ్గురు టీనేజ్ అబ్బాయిల దగ్గరకు టుక్ టుక్ అనే వెహికల్ ఎందుకు వచ్చింది? దానితో వారికి ఎలాంటి బాండ్ ఏర్పడిందన్నది కథలో ఆసక్తికరంగా ఉంటుందని సుప్రీత్కృష్ణ తెలిపారు. మనం ఏ ప్రశ్న అడిగినా స్కూటర్ తనదైన శైలిలో సమాధానం చెబుతుందని, మ్యాజికల్, ఫాంటసీ అంశాలతో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుందని, ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేసే ఆలోచన ఉందని ఆయన చెప్పారు.