Pushpa 2 | ‘పుష్ప2’ డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న కారణంగా నిర్మాణం విషయంలో దర్శకుడు సుకుమార్ వేగం పెంచారు. ఇప్పటికే ఫస్టాఫ్ ఎడిటింగ్ వర్క్ పూర్తయిందని తెలుస్తున్నది. ఇక సెకండాఫ్‌కు సంబంధించిన ఓ ఐటమ్ పాటతో సహా 20 రోజులు వర్క్ పెండింగ్‌లో ఉందని సమాచారం.
ఫహాద్ ఫాజల్కు సంబంధించిన కీలకసన్నివేశాలు ఈ 20రోజుల్లోనే పూర్తిచేస్తారట. ఐటమ్ సాంగ్ రికార్డింగ్ పూర్తయిందనీ, చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్ ఉందని, ఈ పాటలో నటించే తార ఎవరు? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని యూనిట్‌వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే నెల తొలివారం నాటికి షూటింగ్ వర్కంతా పూర్తి చేయాలనే దృఢ నిశ్ఛయంతో సుకుమార్ ఉన్నారట. మొత్తంగా అల్లు అర్జున్ అభిమానులకు ఈ సినిమా విందుభోజనంలా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.