Pushpa-2 | ‘పుష్ప’ చిత్రం తెలుగు చిత్రసీమకు ప్రత్యేకం. ‘బాహుబలి’ సినిమాల తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘పుష్ప’. అటు అవార్డుల పరంగా, ఇటు రివార్డుల పరంగా తనదైన మార్క్‌ని చూపించిందీ సినిమా. తొలిసారి తెలుగుకి జాతీయ ఉత్తమనటుడు అవార్డును తెచ్చిపెట్టింది కూడా ‘పుష్ప’నే. అంతేకాదు.. తెలుగు, కేరళ రాష్ర్టాల్లో మాత్రమే బలంగా ఉన్న బన్నీ ఇమేజ్ను బాలీవుడ్‌కి కూడా వ్యాపింపజేసిన సినిమా ‘పుష్ప’. అందుకే.. దేశవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ‘పుష్ప-2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’కు చెందిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి తెలియవచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం 25నిమిషాల నిడివిగల భారీ యాక్షన్ ఎపిసోడ్‌కి ప్లాన్ చేశారు దర్శకుడు సుకుమార్. ఈ ఎపిసోడ్ కోసం నిర్మాతలు కోట్లు ఖర్చుపెడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా, ఇందులో బన్నీ కేరక్టరైజేషన్ గురించి కూడా కొత్త విషయాలు తెలిశాయి. ‘పుష్ప’కి పూర్తి భిన్నంగా ఇందులో పాత్ర ఉంటుందట. తొలిభాగంలో గంధపుచెక్కల దొంగలా కనిపించిన ‘పుష్ప’.. రెండో భాగంలో అడవిని కాపాడే అమ్మవారిలా కనిపిస్తాడట. అమ్మవారి రూపంలో అడవిలో సంచరిస్తూ అడవిదొంగల భరతం పడుతుంటాడట. ఈ ఎపిసోడ్లన్నీ రోమాంచితంగా ఉంటాయని తెలుస్తున్నది. ఆగస్ట్ 15న ‘పుష్ప-2’ విడుదల కానున్న విషయం తెలిసిందే.