శివనాగేశ్వర రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దోచేవారెవరురా’. ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వర రావు నిర్మించారు. ప్రణవచంద్ర, మాళవిక సతీషన్, మాస్టర్ చక్రి, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి, ప్రణవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని ‘సుక్కు సుక్కు..’ అనే పాటను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను శివనాగేశ్వరరావుగారికి పెద్ద ఫ్యాన్‌ని. వన్స్‌మోర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన తన అనుభవాలను ఒక్క అబద్దం లేకుండా చెబుతున్నారు. ఈ పాటలో ‘సుక్కు సుక్కు..’ అనే సౌండ్ బాగా నచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’ అన్నారు. సుకుమార్ ఈ పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు శివనాగేశ్వరరావు. ఈ చిత్రానికి కెమెరా: అర్లి గణేష్, సంగీతం: రోహిత్ వర్ధన్, రచన-దర్శకత్వం: కె.శివనాగేశ్వరరావు.