‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నాని.. మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టేశారు. ‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్న సుజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. వెంకట్ బోయనపల్లితో కలిసి నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా ప్రారంభవేడుక ఘనంగా జరిగింది. అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
నాని తండ్రి రాంబాబు ఘంటా కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాతలు నాని, వెంకట్ బోయనపల్లి కలిసి స్క్రిప్ట్‌ని దర్శకుడు సుజిత్‌కు అందించారు. తొలి షాట్‌కు దర్శకులు రాహుల్ సంకృత్యాన్, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ కలిసి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు రామ్ జగదీశ్, నిర్మాత సుధాకర్ చెరుకూరితోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
నాని కెరీర్లో 34వ సినిమాగా రానున్న ఈ సినిమాను ప్రపంచస్థాయి ప్రొడక్షన్, సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణం: నిహారిక ఎంటైర్టెన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్.