‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి కుటుంబ కథా చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన ప్రస్తుతం తన కొత్త సినిమా చిత్రీకరణలో ఉన్నారు. యువతరానికి నచ్చే అంశాలతో ఈ సినిమా రూపొందుతున్నది.
ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. జూన్ 2న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయబోతున్నారు. అదే రోజు సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.