Sandeep Reddy Vanga | “పొట్టేల్’ సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. దర్శకుడు సాహిత్ ఇంత గొప్పగా తీస్తాడని అనుకోలేదు. నిర్మాతలు చాలా ప్యాషన్‌తో తీశారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ తర్వాత చూసిన మంచి సినిమా ఇదే. అందరూ తప్పక ఎంకరేజ్ చేయాల్సిన సినిమా’ అని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా అన్నారు. యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌రోల్స్ చేసిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగే నిర్మాతలు. ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అతిథిగా పాల్గొన్న సందీప్‌రెడ్డి వంగా పై విధంగా స్పందించారు.
‘ఈ సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో.. అది ఇంతకుముందు మీరు ఎక్కడ కూడా ఫీల్ అయి ఉండరు. అదైతే కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. చదువుకోడానికి మన పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో గ్రాండ్ పేరెంట్స్ చెబితే అందరం వినుంటాం. దాన్నే ఈ సినిమా ద్వారా విజువల్‌గా చూపించాను. ఆ విజువల్స్ చూస్తే స్టన్ అవుతారు. ఇందులో అందరూ అద్భుతంగా నటించారు. శేఖర్‌చంద్ర మ్యూజిక్ కథకు ప్రధాన బలం. సాంకేతిక నిపుణులంతా మనసుపెట్టి పనిచేవారు. ఇలాంటి సినిమా తీసినందుకు గర్విస్తున్నా’ అని దర్శకుడు సాహిత్ మోత్ఖూరి చెప్పారు. మంచి ఉద్దేశంతో నిర్మించిన సినిమా ఇదని నిర్మాతలు పేర్కొన్నారు. ఇంకా హీరోహీరోయిన్లు యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, నటుడు అజయ్, సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర, నోయల్, గాయకుడు పెంచలదాస్ కూడా మాట్లాడారు.