యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. రేలంగి నరసింహారావు దర్శకుడు. తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మాత. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది. బ్యాలెన్స్ రెండు పాటలను కాశ్మీర్లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం. జూలై చివరివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం.దర్శకుడిగా రేలంగి నరసింహారావుకు ఈ చిత్రం మంచి పేరును తీసుకొస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాబు వర్గీస్, మాటలు: అంగిరెడ్డి శ్రీనివాస్.