రవితేజపై సెటైర్లు వేసిన ఖిలాడి చిత్ర దర్శకుడి భార్య.. ఆగ్రహంలో రవితేజ ఫ్యాన్స్
Khiladi movie | మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఖిలాడీ.
Khiladi movie | మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. విడుదలైన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదని, రవితేజ నటన బాగున్నా ,కథ లేదని నెటీజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే రవితేజకు,రమేష్‌వర్మకు మధ్య గొడవలు అయ్యాయని తెలుస్తుంది. ఖిలాడీ ప్రి రిలీజ్ ఈవెంట్లో రవితేజ స్పీచ్ అనుమానాలను రేకెత్తెస్తున్నాయి. దర్శకుడిని టార్గెట్ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది. దర్శకుడు మహార్జాతకుడు అని, ఆ జాతకానికి, అదృష్టానికి ఓ పేరుంది..అది కోనేరు సత్యనారాయణ. సినిమా రిలీజ్ కాకముందే దర్శకుడుకి కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈయన మహార్జాతకుడా కాదా అంటూ సెటైరికల్‌గా మాట్లాడాడు. ఇక నిర్మాత కోనేరు సత్యనారాయణ ఉద్దేశిస్తూ మీరు దగ్గరుండి అన్ని చూసుకోవాల్సింది. అప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయని రవితేజ అనడం ఎన్నో అనుమానాలను కలుగజేసింది.
ఈ క్రమంలో రమేష్‌వర్మ భార్య రేఖావర్మ రవితేజపై ఇన్‌స్టాగ్రామ్‌లో వేసిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో దర్శకుడు అజయ్ భూపతి చీప్ స్టార్ అనే మాట ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధమవుతుంది అని రేఖావర్మ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. మరొక స్టోరీలో అరటి పండు మీకు బాగా వచ్చు అనుకుంటా తియ్యడం.. డైరెక్టర్ గారు నెక్స్ట్ టైమ్ క్లాసెస్ తీసుకోండి RT దగ్గర. అరటి చెట్టు నరికి ఇచ్చినా సరిపోలేదు RT కి అంటూ రవితేజపై సెటైర్ వేశారు. డైరెక్టర్ కి ఒక స్టైల్ ఉంటుంది. అది మీకు చెప్పి చేయిస్తేనే కెమెరాలో యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తావు.. ఆ క్రెడిట్ దర్శకుడికే దక్కుతుంది అంటూ వేసిన పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై రవితేజ ఫ్యాన్స్ రేఖా వర్మపై మండిపడుతున్నారు. అస్సలు రవితేజకు రమేష్‌వర్మకు మధ్య విభేదాలకు కారణం ఏమైయ్యుంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. గతంలో వీరిద్దరూ కలిసి వీర సినిమాను చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

