Prashanth Varma | చిన్న సైజ్ రాజమౌళిగా మారిపోతున్న ప్రశాంత్ వర్మ..
Prashanth Varma | ఏదైనా ఒక సినిమా విడుదలవుతుంది అంటే అది వచ్చే వరకు తెలియదు.. హిట్ అవుతుందా లేదా అని..! కానీ రాజమౌళి సినిమా విషయంలో మాత్రం ఆ అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమా చేశాడు అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా కలిగించాడు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా 12 సినిమాలతో విజయాలు అందుకుని తనకు ఎదురు లేదు అని నిరూపించుకున్నాడు జక్కన్న. అందుకే తెలుగులో మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త తరం దర్శకులకు రాజమౌళి ఒక ఆదర్శంగా మారాడు. తాజాగా తెలుగులో ఓ కుర్ర దర్శకుడు చిన్న సైజు రాజమౌళిలా మారిపోతున్నాడు. చిత్ర విచిత్రమైన కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఆయనెవరో కాదు ప్రశాంత్ వర్మ.
మొదటి సినిమా అ..! తోనే జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ.. కల్కి, జాంబి రెడ్డి లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. తాజాగా తేజ సజ్జా హీరోగా హను మ్యాన్ అనే సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా విడుదలకు రెడీ అవుతుంది.ఇది సెట్స్ పై ఉండగానే ఇంకో సినిమాకు కూడా ముహూర్తం పెట్టాడు ప్రశాంత్ వర్మ.
ట్రిపుల్ ఆర్ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ అధీరా అనే సూపర్ హీరో సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇది కూడా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తనకున్న లిమిట్ బడ్జెట్‌తోనే విజువల్ ఎఫెక్ట్స్ వాడుకొని అద్భుతాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఈయన విజన్ చూసిన వాళ్లందరూ జూనియర్ రాజమౌళి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ రెండు సినిమాలు గానీ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చూపించాయంటే ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోవడం ఖాయం.
Read More :
RRR సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు కావాలనే పట్టించుకోవడం లేదా..?
“RRR మొదటి రోజు టార్గెట్ 200 కోట్లు.. తగ్గేదే లే..”
SS Rajamouli | ఆర్ఆర్ఆర్కు మించి మహేశ్ సినిమా..హింట్ ఇచ్చేసిన జక్కన్న..!”
“Boycott RRR.. కర్ణాటకలో ఫ్యాన్స్ గొడవ”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ENE Repeat Trailer | ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. నలుగురు స్నేహితుల సందడి ఈసారి మరింత గ్రాండ్‌గా!
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

