ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్, అగ్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్ భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘418’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌నీల్ సమర్పకుడు. సూర్యరాజ్, హనురెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఓ గ్రామంలోని మెడికల్ కాలేజ్ నేపథ్యంలో జరిగే కథ ఇదని, సైన్స్, మూఢనమ్మకాల మధ్య అర్థంకాని ఓ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: వెంకీ జీ, సంభాషణలు: మోహన్ బి ఎస్, దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ.