మల్లెపూవు, మెంటల్‌కృష్ణ, కలవరమాయే మదిలో వంటి హిట్ చిత్రాల్ని నిర్మించిన నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఎమ్4ఎమ్’. ’ జోశర్మ ప్రధాన పాత్రలో నటించారు. మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా ఇటీవల మోహన్ వడ్లపట్ల విలేకరులతో ముచ్చటించారు. అమెరికాలో సీరియల్ కిల్లర్స్ కాన్సెప్ట్ చిత్రాలు చాలా ఫేమస్ అని, వాటి స్ఫూర్తితో ఈ సినిమా తీశానని చెప్పారు.
ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులను గెలుచుకుందని అన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు గోవాలో జరిగిన ‘ఇఫీ’లో కూడా ప్రీమియర్ షోస్ వేశామని తెలిపారు. ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ ఎవరో కనిపెట్టిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామన్నారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఆద్యంతం అనూహ్య మలుపులతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఇప్పవరకూ రాని యూనిక్ పాయింట్‌తో ఈ సినిమా తీశానని, భవిష్యత్తులో కూడా విభిన్న కథాంశాలకే ప్రాధాన్యం ఇస్తానని మోహన్ వడ్లపట్ల తెలిపారు.