The Raaja Saab | ‘రాజా సాబ్’ టీం క్రేజీ నిర్ణయం.. నేటి నుంచి సినిమాలో 8 నిమిషాల అదనపు సీన్లు!
The Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
The Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తొలి రోజు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల విషయంలో మాత్రం ప్రభాస్ స్టామినా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నైట్ షోల నుంచి పుంజుకున్న ఈ చిత్రం, శనివారం నాటి అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ అదరగొడుతోంది. ఫాంటసీ, హారర్ కామెడీ మరియు సైకలాజికల్ థ్రిల్లర్ అంశాల కలయికతో రూపొందిన ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం అభిమానుల అంచనాల వల్లే కొంత నెగిటివిటీ వినిపించినా, సాధారణ ప్రేక్షకులు మాత్రం మారుతి మార్క్ వినోదాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
వింటేజ్ ప్రభాస్‌ను గుర్తు చేస్తూ ఆయన పండించిన కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. థియేటర్లలో నేటి నుంచి ప్రభాస్ ‘ఓల్డ్ గెటప్’కు సంబంధించిన 8 నిమిషాల నిడివి గల అదనపు సన్నివేశాలను జోడిస్తున్నట్లు దర్శకుడు మారుతి ప్రకటించారు. టీజర్లలో చూసిన ఓల్డ్ లుక్ సినిమాలో లేకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్న అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పండుగ వాతావరణం, తోడుగా ఈ కొత్త సీన్స్ యాడ్ కావడంతో ఈ వీకెండ్లో ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

