ప్రస్తుతం దక్షిణాదిన.. ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్న సినిమాల్లో రజనీకాంత్ ‘కూలీ’ మొదటి వరుసలో ఉంటుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లోకేష్ గత చిత్రాలైన ఖైదీ, విక్రమ్‌లకు.. కథాపరంగా, పాత్రల పరంగా సంబంధం ఉన్నట్టే.. ‘కూలీ’కి కూడా వాటితో ఏమైనా సంబంధం ఉంటుందా? అనే అంశంపై ప్రస్తుతం రకరకాల ఊహాగానాలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఊహాగానాలకు తెరదించుతూ ‘కూలీ’ ప్లాట్‌ని లోకేష్ కనకరాజ్ రివీల్ చేశారు. ‘ ‘కూలీ’కీ నా గత చిత్రాలకూ ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇందులో గన్స్ ఉండవ్. డ్రగ్స్ ఉండవ్. ఎలాంటి టైమ్ ట్రావెల్ కూడా ఇది కాదు. ఈ సినిమా అంతా లగ్జరీ వాచ్‌లు, వాటి ఫ్యాక్టరీకి సంబంధించే ఉంటుంది.’ అంటూ అసలు విషయం చెప్పేశాడు. లోకేష్ రివీల్ చేసిన అంశం కొత్తగా ఉండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొన్నది.