పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే లైనప్ చేసుకున్న ప్రభాస్ తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రానికి అంగీకారం తెలిపారట. తాజాగా ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ‘ఖైదీ’ చిత్రంతో ఫేమ్‌లోకి వచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్..ఇటీవల ‘విక్రమ్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు.
కమల్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లలో తమిళ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఈ దర్శకుడు ప్రభాస్‌తో సినిమా చేస్తుండటం ప్రకటన రాకముందే హైప్ క్రియేట్ చేస్తున్నది. మరోవైపు ప్రభాస్ తన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘ఆది పురుష్’ తుది మెరుగులు దిద్దుకుంటుండగా…‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే చిత్రాలు ఒప్పుకున్నారు.