ఇటీవల ‘ఆంధ్రకింగ్ తాలూకా’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకొచ్చారు హీరో రామ్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. గత కొంతకాలంగా కెరీర్లో హిట్ కోసం ఎదురుచూస్తున్నారు రామ్. ఈ నేపథ్యంలో ఆయన తన పంథాను మార్చుకొని తొలిసారి ఓ హారర్ థ్రిల్లర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. కిషోర్ గోపు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మించనుందని సమాచారం.
ఈ సినిమా కథా రూపకల్పనలో రామ్ కూడా భాగమయ్యారని, రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నమైన ఈ కథపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. జనవరిలో తొలివారంలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని, అదే నెలాఖరులో షూటింగ్ ప్రారంభమవుతుందని వార్తలొస్తున్నాయి.