రవితేజ సోదరుడి కుమారుడైన మాధవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. గౌరీ రోణంకి దర్శకురాలు. జేజే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం హీరో మాధవ్ జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘పెళ్లిసందడి’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన తన శిష్యురాలు గౌరీ రోణంకి తెరకెక్కించిన ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
దర్శకురాలు గౌరీ రోణంకి మాట్లాడుతూ ‘రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. నేటి యువతకు కనెక్ట్ అవుతుంది. తొలి సినిమాలోనే హీరో మాధవ్ చక్కటి నటన కనబరిచాడు’ అని చెప్పారు. నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్.