Chiranjeevi | సోషల్‌మీడియాలో చురుకుగా ఉండే సీనియర్ డైరెక్టర్లలో ఒకరు జయంత్ సి పరాన్జీ. డైరెక్టర్‌గా చేసింది కొన్నిసినిమాలే అయినా అవి తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో పనిచేశారు ఈ డైరెక్టర్. జయంత్ సి పరాన్జీ అప్పుడప్పుడు నెట్టింట తన మధుర జ్ఞాపకాలను అభిమానులు, మూవీ లవర్స్‌తో షేర్ చేసుకుంటారని తెలిసిందే.
ఇప్పుడు కూడా ఓ త్రోబ్యాక్ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడీ దర్శకుడు. చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబుతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉన్న స్టిల్ షేర్ చేశాడు. ఈ ఫొటోలో తరుణ్, శ్రీకాంత్, దేవీ శ్రీప్రసాద్, సుమంత్‌ను కూడా చూడొచ్చు. ఇంతకీ ఈ ఫొటో ఎప్పుడు తీసిందనుకుంటున్నారు కదా..? జయంత్ సీ పరాన్జీ బర్త్ డే వేడుకల్లో 2004లో తీసింది.
ఇప్పుడీ ఫొటోను నెట్టంట పోస్ట్చేయగా.. అలనాటి అరుదైన ఫొటోను చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. 2017లోచివరగా జయదేవ్ సినిమా తెరకెక్కించిన జయంత్ మళ్లీ కొత్త సినిమా ఏం ప్రకటించలేదు.