కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్‌నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టీజర్‌ను అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా విడుదల చేశారు. ఫ్రెండ్షిప్, అడ్వెంచర్, కామెడీ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
‘కొంతమంది ఉంటారు శుద్ధపూసలు. ఫస్ట్ వద్దేవద్దు అని షో చేస్తారు. తర్వాత కూర్చున్నాక నాకంటే ఎక్కువ తాగుతారు’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ వినోదాత్మకంగా సాగింది. నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిదని, త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరీష్‌రెడ్డి ఉప్పుల.