సన్నీ డియోల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘జాట్’. గోపీచంద్ మలినేని దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలయ్యాయి. బుధవారం డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ‘పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సన్నీడియోల్ ఇప్పటివరకూ చూడని శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. పోరాట ఘట్టాలు రోమాంచితంగా సాగుతాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. రణదీప్ హూడా, వినీత్‌కుమార్ సింగ్, సయామిఖేర్, రెజీనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సంగీతం: తమన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: గోపీచంద్ మలినేని.