Chiyaan 64 Movie | 96, మెయ్యాళగన్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్.సీ తన కొత్త సినిమాను నటుడు విక్రమ్‌తో ప్రకటించాడు. చియాన్64 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ విక్రమ్ కెరీర్లో 64వ చిత్రంగా రాబోతుంది. ఇక ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్‌పై ఇషారి గణేష్, కుష్మితా గణేష్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరుపుకుని త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విక్రమ్‌ని చిత్రయూనిట్ కలిసిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకుంది.
A collaboration that promises magic on screen ✨
We at @VelsFilmIntl are proud to present our next prestigious venture #Chiyaan64, starring the phenomenal @chiyaan 🔥 and directed by the visionary #PremKumar ⚡@IshariKGanesh @kushmithaganesh@Nitinsathyaa @sooriaruna… pic.twitter.com/imWGOoV57U
— Vels Film International (@VelsFilmIntl) July 16, 2025