టెర్రరిజం నేపథ్యంలో ‘6జర్నీ’ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు దర్శకుడు బసీర్ ఆలూరి. రవిప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బసీర్ ఆలూరి చిత్ర విశేషాలను పంచుకున్నారు. దర్శకుడిగా తనకిది మూడో చిత్రమని, గోవా టూర్‌ను ఎంజాయ్ చేసి ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆరుగురి స్నేహితుల కథ ఇదని తెలిపారు.
ఈ ప్రయాణంలో వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారన్నది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ‘ైక్లెమాక్స్‌ను సందేశాత్మకంగా తెరకెక్కించాం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యువత ఎలాంటి పోరాటం చేయాలనే అంశాల్ని చూపించాం. ైక్లెమాక్స్ ఘట్టాలు దేశభక్తిని పెంపొందిస్తాయి. బోర్డర్లో తెరకెక్కించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో అక్టోబర్‌లో కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నా’ అని బసీర్ చెప్పారు.