Atlee | పది రోజుల కిందట రిలీజైన జవాన్ తమిళ, తెలుగు, హిందీ ఆడియెన్స్‌ను మాములు ఎంటర్టైన్ చేయట్లేదు. మరీ ముఖ్యంగా అట్లీ ఎలివేషన్స్‌కు హిందీ ప్రేక్షకులు వెర్రెత్తిపోతున్నారు. తమిళ, తెలుగు కలెక్షన్లు ఆహా అనే రేంజ్లో లేవు కానీ.. హిందీలో మాత్రం వసూళ్ల సునామీ ఆగట్లేదు. ఇప్పటికే ఏడొందల కోట్ల మైలు రాయిని అందుకున్న ఈ సినిమా మరో వారం రోజుల్లో వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసేందుకు రెడీ అవుతుంది. దానికి తోడు ఈ వారం హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. దాంతో వినాయక చవితి లాంగ్ వీక్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చే చాన్స్ ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంలో మేకర్స్ అభిమానులతో పలు విషయాల గురించి తరచు ముచ్చటిస్తూ ఉన్నారు.
కాగా తాజాగా అట్లీ కూడా ప్రేక్షకులతో పలు విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అట్లీ.. విజయ్, షారుఖ్‌లను పెట్టి ఓ భారీ మల్టీస్టారర్ తీస్తానని, దాని కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తానని చెప్పుకొచ్చాడు. దాంతో సినీ లవర్స్ ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. అయితే ఇందులో ఓ చిక్కు కూడా ఉంది. మాములుగా విజయ్, షారుఖ్‌లు వాళ్ల వాళ్ల ఇండస్ట్రీలలో పెద్ద స్టార్లు. అలాంటి ఇద్దరిని ఒకే స్క్రీన్‌పై చూపించి ఇద్దరి ఆడియెన్స్‌ను సాటిస్ఫై చేయించడం అంటే కత్తి సామే. ఆర్ఆర్ఆర్లో జక్కన్న అటు తారక్‌ను ఇటు చెర్రీని సమంగా చూపించినా.. తారక్ ఫ్యాన్స్ తమ హీరోను తక్కువ చేసి చూపించాడని సోషల్ మీడియాలో పెద్ద పెద్ద చర్చలే జరిగాయి. దాని కోసం రాజమౌళి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది.
అలాంటి మహామహుడే మల్లీస్టారర్ వల్ల అభిమానులను ఫుల్ సాటిస్ ఫై చేయలేకపోయాడు. అలాంటిది అట్లీ చేస్తాడా అనేది అందరిలో ఉన్న డౌటు. అందులోనూ తమిళ తంబీలకు రీజినల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. విజయ్ను ఏమాత్రం తక్కువ చేసి చూపించినా.. అట్లీ ట్రోలర్ రాయుళ్ళకు టార్గెట్ అవడం పక్కా. అయితే అట్లీకి విజయ్ అంటే చెప్పలేని అభిమానం అన్నది తెలిసింది. అలాంటి హీరోకు ఖచ్చితంగా ది బెస్ట్ ఇవ్వాలనే చూస్తాడు. అదే విధంగా జవాన్ వంటి సినిమా చేసే చాన్స్ ఇచ్చిన షారుఖ్‌ను సైతం అట్లీ తక్కువగా చూపించాడు. చూడాలి మరి ఈ కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుందో.