Director Atlee | ‘జవాన్’ చిత్రానికి గాను షారుఖ్ ఖాన్‌తో పాటు సింగర్ శిల్పరావుకి జాతీయ అవార్డులు దక్కిన విషయి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు అట్లీ సోషల్ మీడియా వేదికగా షారుఖ్ ఖాన్‌తో పాటు జవాన్ టీమ్‌కి భావోద్వేగ లేఖ రాశారు.
షారుఖ్ సార్ ‘జవాన్’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో మీతో కలిసి భాగం కావడం నాకు చాలా భావోద్వేగంగా ఉంది. నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది మీకు నా నుంచి మొదటి ప్రేమలేఖ మాత్రమే.. ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. అలాగే ‘చలేయా’ పాటతో ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు గెలుచుకున్న సింగర్ శిల్పా రావుకి అభినందనలు. అలాగే ఈ సినిమాతో మాతో నడిచిన సంగీత దర్శకుడు అనిరుధ్‌కు.. గౌరీ ఖాన్ మేడమ్‌కు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్కు పూజా దాద్లానీ, గౌరవ్ వర్మ, కరుణ బద్వాల్, ఆలిఫ్ సర్‌కు, నా టీమ్ సభ్యులు జికే విష్ణు, లివింగ్స్టన్ రూబెన్, ముత్తురాజ్ తంగవేల్, కునాల్ రాజన్, నా దర్శకత్వ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అని అట్లీ తన లేఖలో పేర్కొన్నారు.
ఇది నా జీవితంలోనే మరిచిపోలేని క్షణం. షారుఖ్ సార్, మీరు పక్కన ఉండటమే ఒక గొప్ప ఆశీర్వాదం. అలాంటిది ఒక అభిమానిగా, మీతో కలిసి పనిచేసి, మీ మార్క్ ‘మాస్’ సినిమాను తీయడంనాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి. దేవుడు మా జీవితంలో ఇంత గొప్ప క్షణాన్ని తిరిగి ఇచ్చినందుకు చాలా దయతో ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ అడగలేను సార్. ఇది నాకు చాలు; నేను మీ అత్యుత్తమ అభిమానిని సార్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. చాలా అంటూ అట్లీ తన లేఖను ముగించాడు.
Feeling blessed, @iamsrk sir. I’m super happy that you’ve got the national award for our movie Jawan. It feels very emotional and inspiring to be part of your journey. Thank you for trusting me and giving this film, sir. It’s just my first love letter to you; a lot more to come,… pic.twitter.com/4JDvwjIX2z
— atlee (@Atlee_dir) August 2, 2025